శ్రీ సుమంత్ రామ్‌పాల్ మార్చి 28 2024 నుండి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద తనఖా వ్యాపారం కోసం గ్రూప్ హెడ్. అతను బ్యాంక్‌కి చెందిన హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియో, ఆస్తి పై లోన్ (LAP) మరియు హెచ్ డి ఎఫ్ సి సేల్స్‌కు నాయకత్వం వహిస్తారు.
దీనికి ముందు, శ్రీ రామ్‌పాల్ బ్యాంక్‌లో బిజినెస్ బ్యాంకింగ్ వర్కింగ్ క్యాపిటల్ (BBG), రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ (RBG) మరియు సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఇనిషియేటివ్ (SLI) కోసం గ్రూప్ హెడ్‌గా ఉన్నారు.
BBG వర్టికల్ అనేది చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల బ్యాంకింగ్ అవసరాలు తీరుస్తుంది; RBG వర్టికల్ అనేది రైతులకు మరియు మొత్తం వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు సర్వీసులు అందిస్తుంది మరియు SLI స్వయం సహాయక బృందాలు, ఉమ్మడి బాధ్యత సమూహాలు మరియు సూక్ష్మ ఆర్థిక సంస్థల బ్యాంకింగ్ అవసరాలు తీరుస్తుంది.
శ్రీ రాంపాల్ నాయకత్వంలో, ఆర్థిక సంవత్సరం (FY) 2019-2020కి SIDBI ద్వారా ఉత్తమ SME బ్యాంక్‌గా; ఆర్థిక సంవత్సరం (FY) 2021-22కి Asiamoney ద్వారా ; ఆర్థిక సంవత్సరం (FY) 2021-22కి Euromoney ద్వారా మరియు ఆర్థిక సంవత్సరం (FY) 2022-23కి Asiamoney ద్వారా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ గుర్తింపు సాధించింది.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నేడు MSME మరియు వ్యవసాయ ఫైనాన్స్ కోసం అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉంటోంది. ECLGS, CGTMSE, AIF, PMFME, CGFMU, FPO మొదలైన ప్రభుత్వ పథకాల క్రింద ఫండింగ్ అందించే అతిపెద్ద ప్రొవైడర్లలో ఇది ఒకటిగా ఉంటోంది.
బ్యాంక్‌తో తన రెండు దశాబ్దాల కెరీర్‌లో కార్పొరేట్ మరియు హోల్‌సేల్ బ్యాంకర్‌గా శ్రీ రామ్‌పాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో 1999లో కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగంలో ఆయన రిలేషన్‌షిప్ మేనేజర్‌గా చేరారు మరియు మిడ్-మార్కెట్ గ్రూప్‌కి రీజినల్ హెడ్ – వెస్ట్‌కి బాధ్యతలు చేపట్టడానికి ముందు కొన్ని ప్రముఖ భారతీయ మరియు MNC కార్పొరేట్లలో పనిచేశారు. మిడ్-మార్కెట్ బిజినెస్ వర్టికల్ నిర్మాణంలో ఆయన గణనీయంగా దోహదపడ్డారు మరియు దాని డిజిటలైజేషన్ ప్రక్రియలో కూడా ఆయన పాల్గొన్నారు.
అతను పూణేలోని సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో పూర్వ విద్యార్థి.
ఖాళీగా ఉన్న సమయంలో, శ్రీ రామ్‌పాల్ కుటుంబంతో సమయాన్ని గడపడం, సినిమాలను చూడడం మరియు మానవ ప్రవర్తనపై పుస్తకాలను చదవడం ఇష్టపడతారు.