అవాంతరాలు లేని షాపింగ్
మీ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ RuPay NRO డెబిట్ కార్డ్ మీకు ఈ క్రింది ప్రదేశాలలో మీ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అకౌంట్‌కు యాక్సెస్ ఇస్తుంది:
1. షాపింగ్ కోసం మర్చంట్ అవుట్‌లెట్లలో
మీ కార్డును ఆన్‌లైన్‌లో దేశీయ వెబ్‌సైట్లలో ఉపయోగించవచ్చు. 1 డిసెంబర్ 2013 నుండి అమలు అయ్యే విధంగా, RBI ఆదేశం ప్రకారం మీరు మీ ATM PIN ఉపయోగించి మర్చంట్ లొకేషన్ వద్ద పాయింట్-ఆఫ్-సేల్ ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేయాలి. 1 డిసెంబర్ 2013 నుండి అమలు అయ్యే విధంగా, తప్పు PIN నమోదు చేసినట్లయితే/ఎటువంటి PIN నమోదు చేయకపోతే మర్చంట్ అవుట్‌లెట్ వద్ద ట్రాన్సాక్షన్ తిరస్కరించబడుతుంది
మీ కొనుగోళ్లను ఎంచుకున్న తర్వాత మర్చంట్‌కు మీ కార్డును సమర్పించండి. మర్చంట్ ఎలక్ట్రానిక్ టర్మినల్ ద్వారా కార్డును స్వైప్ చేస్తారు మరియు కొనుగోలు మొత్తాన్ని నమోదు చేస్తారు
ఆమోదం పొందిన తర్వాత,టర్మినల్ కొనుగోళ్ల వివరాలతో ఒక ట్రాన్సాక్షన్ రసీదు ప్రింట్ చేస్తుంది. రసీదును తనిఖీ చేయండి మరియు తగిన ప్రదేశంలో సంతకం చేయండి. మీ కొనుగోలు మొత్తం కోసం ఆన్‌లైన్‌లో మీ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేయబడుతుంది (మీ అకౌంట్‌లో గల నిధుల లభ్యతకు లోబడి)
మర్చంట్ ట్రాన్సాక్షన్ స్లిప్ మరియు మీ కార్డ్ కాపీని తిరిగి ఇస్తారు. దయచేసి మీరు మీ స్వంత కార్డును అందుకున్నారని నిర్ధారించుకోండి.
2. మీ Rupay NRO డెబిట్ కార్డ్‌తో ఆన్‌లైన్ షాపింగ్ కోసం
RuPay NRO PaySecure ఉపయోగించి మీరు మీ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ RuPay NRO డెబిట్ కార్డ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు
3. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ATMల వద్ద:
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ATMలలో మీరు ఈ క్రింది సేవలను పొందవచ్చు:
అకౌంట్ ఎంపిక
నగదు విత్డ్రాల్/బ్యాలెన్స్ విచారణ
చెక్/క్యాష్ డిపాజిట్
ఖాతాల మినీ స్టేట్‌మెంట్
అకౌంట్ స్టేట్‌మెంట్/చెక్ బుక్ అభ్యర్థన
మీ స్వంత అకౌంట్ల మధ్య ఫండ్స్ ట్రాన్స్‌ఫర్
PIN మార్చండి
BILLPAY
4. ఇతర బ్యాంకుల ATMలలో, మీరు పొందవచ్చు:
నగదు విత్డ్రాల్
బ్యాలెన్స్ విచారణ