Who we are

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ గురించి

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ భారతదేశం యొక్క ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటి.  

 

ప్రైవేట్ రంగంలో బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి "సూత్రప్రాయంగా" ఆమోదం పొందిన భారతదేశంలోని మొదటి ఆర్థిక సంస్థలలో హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లేదా హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ ఒకటి. 1994 లో భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమ యొక్క సరళీకరణ కోసం RBI యొక్క పాలసీలో భాగంగా ఇది చేయబడింది. 

 

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆగస్టు 1994 లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ పేరుతో, భారతదేశంలోని ముంబైలో దాని రిజిస్టర్డ్ కార్యాలయంతో స్థాపించబడింది. జనవరి 1995 లో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య బ్యాంక్‌గా బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. 

 

ఏప్రిల్ 4, 2022 నాడు భారతదేశం యొక్క అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ మరియు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ విలీనం, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ప్రకటించబడింది. హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్, గత 45 సంవత్సరాలలో ఉత్తమ ప్రోడక్ట్ ఆఫరింగ్స్‌లో ఒకదాన్ని అభివృద్ధి చేసింది, ఇది హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్‌లో లీడర్‌గా మారింది. పట్టణ, సెమీ అర్బన్ మరియు గ్రామీణ భారతదేశానికి సేవలు అందించే విస్తృత ప్రోడక్ట్ సూట్‌లో భాగంగా హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ హోమ్ లోన్ల అవాంతరాలు లేని డెలివరీని అనుమతిస్తుంది. విలీనం తర్వాత, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అనేది ఒక వృత్తిపరంగా నిర్వహించబడే సంస్థ, ఇది అనుభవజ్ఞులైన డైరెక్టర్ల బోర్డు ద్వారా పర్యవేక్షించబడుతుంది మరియు గుర్తించబడిన ప్రమోటర్‌ను కలిగి ఉండదు. విలీనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను దాని అనుబంధ సంస్థల ద్వారా బ్యాంకింగ్ నుండి ఇన్సూరెన్స్ మరియు మ్యూచువల్ ఫండ్‌లు‌ వరకు పూర్తి ఆర్థిక సేవలను అందించే ఒక ఆర్థిక సేవల సమూహంగా మార్చడాన్ని కూడా సూచిస్తుంది.  

 

బ్యాంక్ యొక్క పంపిణీ నెట్‌వర్క్ సెప్టెంబర్ 30, 2024 నాటికి 4,088 నగరాలు/పట్టణాలలో గల 9,092 శాఖలు మరియు 20,993 ATMలతో పోలిస్తే సెప్టెంబర్ 30, 2025 నాటికి 4,156 నగరాలు/పట్టణాలలో 9,545 శాఖలు మరియు 21,417 ATMలను కలిగి ఉంది. మా శాఖలలో 51% సెమీ-అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 

 

బ్యాంక్ యొక్క అంతర్జాతీయ కార్యకలాపాలలో హాంకాంగ్, బహ్రెయిన్, దుబాయ్ మరియు గుజరాత్ అంతర్జాతీయ ఫైనాన్స్ TEC సిటీలో ఒక IFSC బ్యాంకింగ్ యూనిట్ (ఐబియు) లో నాలుగు శాఖలు ఉంటాయి. ఇది కెన్యా, అబుదాబి, దుబాయ్, లండన్ మరియు సింగపూర్‌లో ఐదు ప్రతినిధి కార్యాలయాలను కలిగి ఉంది. సింగపూర్ మరియు లండన్ కార్యాలయాలు గతంలో హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క ప్రతినిధి కార్యాలయాలు మరియు విలీనం తర్వాత బ్యాంక్ యొక్క ప్రతినిధి కార్యాలయాలుగా మారాయి. ఇవి భారతదేశంలో హౌసింగ్ లోన్లు పొందడానికి లోన్లు-సంబంధిత సేవలను అందించడానికి మరియు భారతదేశంలో ఆస్తుల కొనుగోలు కోసం ఉన్నాయి​​​​​​​ 

 

మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు

హెచ్ డి ఎఫ్ సి వారసత్వం

  • భారతదేశంలో ఉన్న లక్షలాది మంది మధ్య తరగతి పౌరులు తమ పదవీవిరమణ సమయం వరకు వేచి ఉండకుండా స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలి అనే ఆకాంక్షతో కీర్తి శేషులు శ్రీ హెచ్‌టి పరేఖ్ 1977 లో హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ ను స్థాపించారు. పద్మ విభూషణ్ గ్రహీత అయిన కీర్తి శేషులు శ్రీ హెచ్‌టి పరేఖ్ ఆర్థిక పరిశ్రమకు పథనిర్దేశం చేస్తూ నైతిక నిష్ఠ, పారదర్శకత మరియు వృత్తి పట్ల నిబద్ధత అనే బలమైన పునాదుల పై హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్‌ను నిర్మించారు. వారసత్వాన్ని కొనసాగిస్తూ పద్మ భూషణ్ గ్రహీత మరియు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ ఛైర్మన్ అయిన శ్రీ దీపక్ పరేఖ్ తనఖా రంగంలో హెచ్ డి ఎఫ్ సి ని అగ్రగామి సంస్థగా నిలపడమే కాకుండా బ్యాంకింగ్, అసెట్ నిర్వహణ, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ , రియల్ ఎస్టేట్ వెంచర్ ఫండ్, ఎడ్యుకేషన్ లోన్లు మరియు విద్య రంగాలలో ఉనికితో భారతదేశంలోనే ప్రముఖ ఆర్థిక సేవల సంఘటిత సంస్థగా నిలిపారు.

    ​​​​​​​ఇక్కడ క్లిక్ చేయండి
     మరింత చదవడానికి.

Card Reward and Redemption

CSR

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పరివర్తన్. పురోగతి దిశగా ఒక అడుగు.

    పరివర్తన్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క సామాజిక చొరవ భారతదేశంలో లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇది దాని కమ్యూనిటీలను స్థిరంగా సాధికారపరచడం ద్వారా దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడటం లక్ష్యంగా కలిగి ఉంది. వివిధ సామాజిక అంశాలలో చేపట్టిన విస్తృత కార్యక్రమాల ద్వారా, దేశంలోని అత్యంత దూర ప్రాంతాల్లో కూడా కోరుకున్న మార్పును తీసుకొచ్చింది. పరివర్తన్ గ్రామీణ జీవితాలను మెరుగుపరిచింది, నీటి సంబంధిత నిర్మాణాలను ఏర్పాటు చేసింది, విద్యలో విప్లవాత్మక మార్పు తెచ్చింది, సామాజిక స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చింది మరియు స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం కోసం మార్గాలను తెరిచింది. ఇప్పటికే చాలా చేసినా, బ్యాంక్ తన స్థిరత్వం మరియు ఆవిష్కరణ తత్వంతో మార్పును తీసుకువస్తూనే ఉంది. పరివర్తన్ కింద, మేము ఈ క్రింద పేర్కొన్న రంగాల పై దృష్టి సారిస్తున్నాము:

    1. గ్రామీణ అభివృద్ధి
    2. విద్యను ప్రోత్సహించడం
    3. నైపుణ్య శిక్షణ మరియు జీవనోపాధి మెరుగుదల
    4. ఆరోగ్య సంరక్షణ మరియు పరిశుభ్రత
    5. ఆర్థిక అక్షరాస్యత మరియు చేర్పు
    6. సురక్షిత బ్యాంకింగ్

    ఇక్కడ క్లిక్ చేయండి మరింత చదవడానికి

Card Reward and Redemption

విజన్, మిషన్ మరియు విలువలు

  • ప్రపంచ స్థాయి భారతీయ బ్యాంకుగా ఉండటం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క లక్ష్యం. మా వద్ద రెండు విధాల లక్ష్యాలు ఉన్నాయి: మొదట, ఎంపిక చేయబడిన రిటైల్ మరియు హోల్‌సేల్ కస్టమర్ విభాగాల కోసం బ్యాంకింగ్ సేవలను అందించే ప్రాధాన్యతగల సేవాప్రదాతగా ఉండటం. రెండవ లక్ష్యం ఏంటంటే బ్యాంక్ యొక్క రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా, లాభదాయకతలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించడం.

  • అత్యధిక స్థాయి నైతిక ప్రమాణాలు, వృత్తిపరమైన సమగ్రత, కార్పొరేట్ గవర్నెన్స్ మరియు రెగ్యులేటరీ సమ్మతిని నిర్వహించడానికి బ్యాంక్ కట్టుబడి ఉంది. హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ యొక్క బిజినెస్ ఫిలాసఫీ ఐదు ప్రధాన విలువల ఆధారంగా ఉంటుంది: ఆపరేషనల్ ఎక్సెలెన్స్, కస్టమర్ ఫోకస్, ప్రోడక్ట్ లీడర్‌షిప్, ప్రజలు మరియు స్థిరత్వం.

Card Reward and Redemption

మూలధన నిర్మాణం

  • 31-March-2025 నాటికి, బ్యాంక్ యొక్క అధీకృత షేర్ క్యాపిటల్ ₹1190.61 కోట్లు. పేర్కొన్న తేదీ నాటికి బ్యాంక్ యొక్క పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ ₹7,65,22,21,674 ఉండగా, ఇందులో ప్రతి ఒక్క షేర్ ఫేస్ వాల్యూ ₹1/- తో 7,65,22,21,674 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. బ్యాంక్ యొక్క అమెరికన్ డిపాజిటరీ షేర్లకు (ADS) సంబంధించి ADS డిపాజిటరీలు ఈక్విటీలో 13.44% కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, 41.81% ఈక్విటీని విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు)/విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPI) కలిగి ఉన్నారు మరియు బ్యాంక్‌కు 38,29,146 వాటాదారులు ఉన్నారు.

  • ఈక్విటీ షేర్లు BSE లిమిటెడ్ (BSE) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE) పై జాబితా చేయబడ్డాయి. బ్యాంక్ యొక్క అమెరికన్ డిపాజిటరీ షేర్లు (ADS) న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (NYSE) లో 'HDB' చిహ్నంతో జాబితా చేయబడ్డాయి.

Card Reward and Redemption

CBoP & TIMES BANK విలీనం

  • మే 23, 2008 నాడు, చట్టబద్ధమైన మరియు నియంత్రణ ఆమోద ప్రక్రియను పూర్తి చేయడానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌‌‌‌‌‌తో Centurion Bank of Punjab (CBoP) విలీనాన్ని అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. విలీనం పథకం ప్రకారం, CBoP యొక్క వాటాదారులు CBoP యొక్క ప్రతి 29 షేర్లకు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క ఒక షేర్ అందుకున్నారు.

  • ఈ విలీనం పెరిగిన బ్రాంచ్ నెట్‌వర్క్, భౌగోళిక వ్యాప్తి, కస్టమర్ల సంఖ్య మరియు పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన మానవశక్తితో హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్‌కు గణనీయమైన విలువను జోడించింది.

  • భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో ఒక కీలకమైన ట్రాన్సాక్షన్‌లో భాగంగా, ఫిబ్రవరి 26, 2000 నుండి Times Bank Limited (Bennett, Coleman & Co. లేదా Times Group ద్వారా ప్రమోట్ చేయబడినఒక కొత్త ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్) హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్‌తో విలీనం చేయబడింది. ఇది కొత్త తరం ప్రైవేట్ రంగ బ్యాంకులలో రెండు ప్రైవేట్ బ్యాంకుల మొదటి విలీనం. బ్యాంకులు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క షేర్‌హోల్డర్ల ద్వారా ఆమోదించబడిన విలీన పథకం ప్రకారం, Times Bank యొక్క షేర్‌హోల్డర్లు Times Bank యొక్క ప్రతి 5.75 షేర్ల కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో ఒక షేర్‌ను అందుకున్నారు.

Card Reward and Redemption

పంపిణీ నెట్‌వర్క్

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. బ్యాంక్ యొక్క పంపిణీ నెట్‌వర్క్ సెప్టెంబర్ 30, 2024 నాటికి 4,088 నగరాలు/పట్టణాలలో గల 9,092 శాఖలు మరియు 20,993 ATMలతో పోలిస్తే సెప్టెంబర్ 30, 2025 నాటికి 4,156 నగరాలు/పట్టణాలలో 9,545 శాఖలు మరియు 21,417 ATMలను కలిగి ఉంది. మా బ్రాంచ్‌లలో 51% సెమీ-అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క కస్టమర్లు ఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు SMS ఆధారిత బ్యాంకింగ్ వంటి అనేక డెలివరీ ఛానెళ్ల ద్వారా సేవలు అందించబడతారు. బ్యాంక్ యొక్క విస్తరణ ప్రణాళికలలో భాగంగా తన కార్పొరేట్ కస్టమర్లు ఉన్న అన్ని ప్రధాన పారిశ్రామిక మరియు వాణిజ్య కేంద్రాలలో ఉనికిని కలిగి ఉండాలి, అలాగే డిపాజిట్లు మరియు రుణ ఉత్పత్తుల కోసం బలమైన రిటైల్ కస్టమర్ల సంఖ్యను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. వివిధ ప్రముఖ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు క్లియరింగ్/సెటిల్‌మెంట్ బ్యాంక్‌గా ఉండటం వలన, NSE / BSE బలమైన మరియు యాక్టివ్ సభ్యుల సంఖ్యను కలిగి ఉన్న కేంద్రాలలో బ్యాంక్ తన శాఖలను కలిగి ఉంది. భారతదేశ వ్యాప్తంగా బ్యాంక్ 21,049 ATMల నెట్‌వర్క్‌ను కూడా కలిగి ఉంది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క ATM నెట్‌వర్క్‌ను అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ VISA / Mastercard, VISA Electron / Maestro, Plus / Cirrus మరియు American Express Credit / Charge కార్డ్ హోల్డర్లు యాక్సెస్ చేయవచ్చు.

Card Reward and Redemption

టెక్నాలజీ

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ "బ్యాంకింగ్ లైసెన్స్ కలిగిన టెక్నాలజీ కంపెనీ" నిలవాలి అనే ఆకాంక్షతో ఒక పరివర్తనాత్మక మార్గంలో ప్రయాణం ప్రారంభించింది. ఈ పరివర్తనను సాధికారపరచడానికి కీలక రంగాలలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు ఆటోమేషన్‌ను ఉపయోగించడంతో పాటు అత్యాధునిక సమాచార సాంకేతికత మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలకు అనుసరించడం ముఖ్యం.

  • మా కస్టమర్లకు ఫ్రంట్-ఎండ్‌లో అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడానికి మేము మా టెక్ కాంపీటెన్స్ కేంద్రాలలో బ్యాక్ ఎండ్ వద్ద అత్యంత సమర్థవంతమైన పద్ధతిలో మా కార్యకలాపాలను నిర్వహిస్తాము. సులభమైన ఎండ్ వినియోగదారు ఆపరేషన్ మరియు మెరుగైన లభ్యత కోసం, అన్ని శాఖలు బ్రాంచ్ నెట్‌వర్క్ మరియు ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ల (ATMలు) ద్వారా మా కస్టమర్లకు మల్టీ-యాక్సెస్ ఇచ్చే ఆన్‌లైన్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి.

  • అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఉత్తమ-శ్రేణి సాంకేతికతను పొందడానికి మేము నిరంతరం అభివృద్ధి చెందుతున్నాము మరియు అప్‌గ్రేడ్ చేస్తున్నాము, ఇది మమ్మల్ని నిజంగా ఒక ప్రపంచ స్థాయి బ్యాంకుగా చేస్తుంది.

  • కార్పొరేట్ బ్యాంకింగ్ కోసం Flexcube మరియు రిటైల్ బ్యాంకింగ్ కోసం Finware లను మా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థలు సులభమైనవి, విస్తరించదగినని మరియు వెబ్ ద్వారా యాక్సెస్ చేయదగినది.

  • హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ వద్ద, మేము అవాంతరాలు లేని, నియో-బ్యాంకింగ్ అనుభవాలను అందించడం ద్వారా బ్యాంకింగ్‌ను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తాము. మా ప్రతి వ్యాపారాలు మా కస్టమర్ల కోసం కొత్త డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధి చేయడానికి ఆ ప్రత్యేక డొమైన్ ఆధారిత నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి, ఇది డిజిటల్ బ్యాంకింగ్ యొక్క తదుపరి దశకు ద్వారాలు తెరుస్తుంది.

Card Reward and Redemption

MOGO - మా మ్యూజికల్ లోగో

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క MOGO - మా మ్యూజికల్ లోగో - ఇది భారతదేశం యొక్క ప్రధాన డిజిటల్ బ్యాంక్‌గా మారడానికి బ్యాంక్‌ను నడిపించిన విలువల యొక్క మెరుగైన వ్యక్తీకరణ. ఇది కస్టమర్లతో ఒక శక్తివంతమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి మరియు ATMలు, ఫోన్‌బ్యాంకింగ్, యాప్స్ మరియు ఇతర టచ్-పాయింట్లు వంటి ప్లాట్‌ఫారమ్‌లు వ్యాప్తంగా - వాటాదారుల మధ్య గుర్తింపు ఏర్పరచడానికి సహాయపడుతుంది
    మా MOGO మేము అనుసరించే రెండు కీలక అంశాలను ప్రతిబింబిస్తుంది:

  • నమ్మకం

    గత రెండు దశాబ్దాలలో సంరక్షణ మరియు విశ్వసనీయత ద్వారా సృష్టించబడింది

  • ప్రగతిశీల మార్పు

    మా కస్టమర్ల యొక్క నిరంతరం మారుతున్న అవసరాలను పరిష్కరించడానికి

    ఈ మ్యూజికల్ లోగో ఇన్నోవేషన్ మరియు డైనమిజంను వ్యక్తం చేసే రాగ్ బిలావల్ మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క సంరక్షణ, మానవీయ కోణాన్ని వ్యక్తం చేసే రాగ్ శుద్ కళ్యాణ్ నుండి స్ఫూర్తి పొందింది. మీరు మన స్వంత సితార‌‌‌‌‌‌తో పాటు పియానో మరియు గిటార్ వంటి సమకాలీన పాశ్చాత్య సాధనాలను ఇందులో వినగలుగుతారు, తద్వారా ఇది ప్రపంచ ఆకాంక్ష మరియు భారతీయత యొక్క సంపూర్ణ మిశ్రమాన్ని సృష్టిస్తుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మోగోను వినడానికి

    MOGO అనేది బ్రాండ్ మ్యూజిక్ యొక్క రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్.

Card Reward and Redemption