చీఫ్ ఆర్థిక ఆఫీసర్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

శ్రీ శ్రీనివాసన్ వైద్యనాథన్

శ్రీ శ్రీనివాసన్ వైద్యనాథన్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఈ పాత్రలో, అతను ఫైనాన్స్ మరియు సంబంధిత ప్రక్రియలకు బాధ్యత వహిస్తారు. అదనంగా, బ్యాంక్‌లో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఫంక్షన్‌కు కూడా అతను బాధ్యత వహిస్తారు.

న్యూయార్క్‌లోని Citigroup నుండి శ్రీ వైద్యనాథన్ ఈ బ్యాంక్‌లో చేరారు. న్యూయార్క్‌లో ఆయన Institutional Clients Groupలో మేనేజింగ్ డైరెక్టర్ - ఫైనాన్స్ & డిప్యూటీ ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ ఆయన $1.3 ట్రిలియన్ కంటే ఎక్కువ బ్యాలెన్స్ షీట్‌ నిర్వహించారు. అంతకుముందు, న్యూయార్క్‌లోని Citi Global Treasuryలో ఆయన CFO గా పనిచేశారు. 1991లో ఆయన Citiలో చేరారు మరియు సింగపూర్, హాంకాంగ్ మరియు న్యూయార్క్ లాంటి విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ నాయకత్వ పదవులు నిర్వహించారు. రిటైల్, కార్డులు, & ఇనిస్టిట్యూషనల్ బిజినెస్‌లు మరియు కార్పొరేట్ విధులు కవర్ చేయడం ద్వారా ప్రోడక్టులు మరియు ప్రాసెస్‌లలో ఆయన విభిన్న నైపుణ్యం కలిగి ఉన్నారు.

Citiలో తన 27 సంవత్సరాల కాలంలో, ఆర్థిక నియంత్రణ మరియు ప్రక్రియలను ఆయన విజయవంతంగా నడిపించారు, ఆర్థిక పనితీరును ఎంతో ఆసక్తితో నిర్మించారు మరియు వ్యాపార ఫలితాలను ముందుకు తీసుకెళ్లారు. ఆర్థిక ప్రణాళిక; MIS మరియు విశ్లేషణ; ట్రెజరీ; ట్రెజరీ రిపోర్టింగ్ మరియు విశ్లేషణ; మరియు వ్యయ నియంత్రణ మరియు నిర్వహణకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా, Citi Global Consumer Award for Excellence మరియు Citi Chairman’s Award for Service Excellence పురస్కారాలు ఆయనకు లభించాయి. Global Consumer Planning Groupలో కూడా ఆయన పని చేశారు.

మద్రాస్ యూనివర్సిటీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రీ వైద్యనాథన్, వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కూడా సాధించారు. ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్స్ మరియు కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్‌లో ఆయన ఫెలోగా ఉన్నారు; UK అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటెంట్స్ ఫెలోగా మరియు USAలోని CMAలో మెంబర్‌గా ఉన్నారు. ఆయన MBA కూడా పూర్తి చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్మీడియట్ మరియు ఫైనల్ స్థాయిలో ఆయన ఆల్-ఇండియా ర్యాంక్ హోల్డర్‌గా ఉన్నారు.

శ్రీ వైద్యనాథన్‌కి క్రికెట్ అంటే ఇష్టం. సింగపూర్ మరియు చెన్నైలోని వివిధ క్లబ్‌లకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. బాధ్యతల నుండి విరామం తీసుకున్న సమయంలో, కర్ణాటక సంగీతం వినడం లేదా ప్రపంచవ్యాప్తంగా పర్యటించడం లేదా కుటుంబంతో సమయం గడపడం ఆయనకు ఇష్టం.