గ్రూప్ హెడ్ - వర్చువల్ రిలేషన్‌షిప్, వర్చువల్ కేర్, వర్చువల్ సేల్స్ ఛానెల్స్, బిఇయు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

మిస్. ఆషిమా భట్

మిస్ ఆషిమా భట్ ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో వర్చువల్ రిలేషన్‌షిప్, వర్చువల్ కేర్, వర్చువల్ సేల్స్ ఛానెల్స్, BEU మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫంక్షన్స్ - గ్రూప్ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుత బాధ్యతల్లో భాగంగా, వర్చువల్ మార్గాల్లో విస్తృత కస్టమర్ బేస్‌కి రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సర్వీసులు అందించే బ్యాంక్ సామర్థ్యం మెరుగుపరచడానికి ఆమె బాధ్యత వహిస్తున్నారు.

దీనికంటే ముందు, బ్యాంక్ సంబంధిత బిజినెస్ ఫైనాన్స్ & స్ట్రాటజీ, ESG (ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) మరియు CSR (కార్పొరేట్ సామాజిక బాధ్యత), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్‌కి మిస్ భట్ నాయకత్వం వహించారు. ESG కార్యక్రమాల కోసం బ్యాంక్ రోడ్‌మ్యాప్‌ రూపొందించిన మరియు దాని అమలు ప్రోత్సహించిన బృందానికి ఆమె నాయకత్వం వహించారు. CSR హెడ్‌గా నిర్వహించిన బాధ్యతల్లో భాగంగా, బ్యాంక్ చేసిన CSR గురించి విస్తృత అవగాహన తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. జూన్ 30, 2023 నాటికి 99 మిలియన్లకు పైగా భారతీయుల జీవితాలను హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ప్రభావితం చేసింది. బ్యాంక్ తన CSR ఛత్రంలో భాగమైన 'పరివర్తన్' క్రింద, విద్య, పారిశుద్ధ్యం మరియు నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి సారించే భారతదేశ వ్యాప్త రంగాల్లో ప్రభావవంతమైన ప్రాజెక్టులు చేపడుతోంది.

1994లో బ్యాంక్ ప్రారంభమైన నాటి నుండి ఆషిమా ఈ బ్యాంక్‌తోనే ఉన్నారు. మరియు బ్యాంక్ అభివృద్ధి కథనంలో ఒక అంతర్భాగంగా ఉన్నారు. ఈ బ్యాంక్‌తో తన 29 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె అనేక విజయాలు సాధించారు. ఆమె గతంలో నిర్వహించిన బాధ్యతల్లో ఎమర్జింగ్ కార్పొరేట్స్ గ్రూప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మరియు హెల్త్‌కేర్‌ లాంటి వాటికి హెడ్‌గా పనిచేశారు. అంతకుముందు, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ - వెస్ట్‌కి ఆమె నాయకత్వం వహించారు.