ఇండిపెండెంట్ డైరెక్టర్

డాక్టర్ (శ్రీ) హర్ష్ కుమార్ భన్వాలా

డాక్టర్. (శ్రీ.) హర్ష్ కుమార్ భన్వాలా, వయస్సు అరవై-మూడు (63) సంవత్సరాలు, బోర్డ్ పరిపాలన మరియు నిర్వహణ, ఫైనాన్స్, గ్రామీణ అభివృద్ధి, సుస్థిరమైన వ్యవసాయానికి ప్రోత్సాహం మరియు మద్దతు అందించడం, మరియు గ్రామీణ సహకార బ్యాంకుల పర్యవేక్షణ మరియు అభివృద్ధి వంటి రంగాలలో 38 సంవత్సరాలకు పైగా విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. అతను కర్నాల్‌లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (NDRI) నుండి డైరీ టెక్నాలజీలో B.Sc. పూర్తిచేసారు.  

డాక్టర్ (శ్రీ) భన్వాలా IIM, అహ్మదాబాద్ నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు మరియు మేనేజ్‌మెంట్‌లో Ph.D. కలిగి ఉన్నారు. ఆయనకు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్, ముంబై ద్వారా సైన్స్‌లో గౌరవ డాక్టరేట్ అందించబడింది. 

ఆయన దేశంలోని అత్యున్నత అభివృద్ధి బ్యాంక్ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD), కు డిసెంబర్ 18, 2013 నుండి మే 27, 2020 వరకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన India Infrastructure Finance Company Ltd. (IIFCL) కు మొదట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా మరియు తరువాత ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ఢిల్లీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఇటీవల, ఆయన లిస్ట్ చేయబడిన NBFC (క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్) యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన Microfinance Industry Network ( NBFC MFI ల అసోసియేషన్) డైరెక్టర్‌‌గా కూడా ఉన్నారు.  

డాక్టర్. (శ్రీ.) భన్వాలా సోషల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ పై సెబీ ద్వారా నియమించబడిన సాంకేతిక బృందానికి నాయకత్వం వహించారు (సెప్టెంబర్ 2020). ఆయన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లో సవరణ తర్వాత ఏర్పాటు చేయబడిన RBI యొక్క ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకుల నిపుణుల కమిటీలో సభ్యునిగా ఉన్నారు.  

ఆయనకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC), IRMA (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (NIBM) లలో విస్తృత అనుభవం ఉంది మరియు Bayer Crop Science మరియు Arya Collateral Warehousing Services Private Limited బోర్డుల స్వతంత్ర డైరెక్టర్‌గా విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. ఆయన Asia-Pacific Rural and Agricultural Credit Association (APRACA) వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 

డాక్టర్. (శ్రీ.) భన్వాలా The Multi Commodity Exchange of India Limited యొక్క ప్రజా ప్రయోజన డైరెక్టర్ మరియు చైర్మన్‌గా మరియు మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ (NBFC - MFI ల అసోసియేషన్) డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.  

​​​​​​​ డాక్టర్. (శ్రీ.) భన్వాలా ఏ ఇతర కంపెనీ లేదా బాడీ కార్పొరేట్‌లో పూర్తి కాలపు హోదా కలిగి లేరు.