శ్రీ వినాయక్ మావిన్‌కూర్వే హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వద్ద రియాల్టీ బిజినెస్ ఫైనాన్స్‌కి గ్రూప్ హెడ్.
బ్యాంకులో చేరడానికి ముందు, హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ (MoEM) సభ్యుడిగా శ్రీ మావిన్‌కుర్వే పనిచేశారు, రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ లెండింగ్, కార్పొరేట్ లెండింగ్ మరియు స్ట్రెస్డ్ అసెట్ బుక్‌తో పాటు ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ బుక్ ఆఫ్ ది కంపెనీగా కూడా ఆయన బాధ్యత వహించారు.
క్రెడిట్ ఫోరమ్ సభ్యుడిగా మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా, కొత్త లోను అప్రూవల్స్ ప్రారంభించడానికి, బిజినెస్ లక్ష్యాలు పర్యవేక్షించడానికి మరియు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) నియంత్రణ నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణకు మారడానికి సహాయపడటానికి బ్రాంచ్‌లతో ఆయన సన్నిహితంగా పనిచేశారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నియంత్రణ తీసుకువచ్చిన సమయంలో RBIతో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు.
1994లో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా IFCI Limitedలో శ్రీ మావిన్‌కూర్వే తన కెరీర్ ప్రారంభించారు. ఆతర్వాత, 1998లో IDFC లిమిటెడ్‌లో ఆయన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు మరియు 2015 వరకు అక్కడే పనిచేశారు. అక్కడ చివరి బాధ్యతగా ప్రాజెక్ట్ ఫైనాన్స్‌కు హెడ్‌గా ఆయన బాధ్యత నిర్వహించారు. మే 2017లో, ఆయన IDFC బ్యాంక్ లిమిటెడ్‌లో చేరారు మరియు డిసెంబర్ 2018 వరకు అక్కడ కో-హెడ్ - క్లయింట్ కవరేజ్ బాధ్యతలు నిర్వహించారు.
VJTI, ముంబై నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో B.Tech (బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ) డిగ్రీ (1991 బ్యాచ్)తో పాటు NMIMS, ముంబై (1994 బ్యాచ్) నుండి MMS డిగ్రీని శ్రీ మావిన్‌కుర్వే పూర్తి చేశారు.
శ్రీ మావిన్‌కూర్వే వివాహం మాధవితో జరిగింది. ఆమె గృహిణిగా ఉన్నారు. వారి కుమారుడైన రోహన్ ప్రస్తుతం UKలోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఫుట్‌బాల్, క్రికెట్ మరియు టెన్నిస్ అంటే అత్యంత ఆసక్తి కలిగి క్రీడా ఔత్సాహికుడు.