శ్రీ రవి సంతానం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు గ్రూప్ హెడ్ (బ్రాండ్, రిటైల్ మార్కెటింగ్ మరియు కస్టమర్ అనలిటిక్స్).
బ్యాంక్ సంబంధిత అన్ని ఉత్పత్తుల డిజిటల్ ఆర్జినేషన్ మరియు ఫుల్‌ఫిల్‌మెంట్‌తో పాటు డైరెక్ట్ టూ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్‌కి ఆయన బాధ్యత వహిస్తున్నారు. బ్యాంక్ వ్యాప్తంగా NPS వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కస్టమర్ సెంట్రిక్సిటీ ప్రాక్టీస్ వ్యవస్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బ్యాంకులో లయబిలిటీ ప్రొడక్ట్స్, మేనేజ్డ్ ప్రోగ్రామ్స్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్లకు శ్రీ సంతానం గతంలో నాయకత్వం వహించారు.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌కి రావడానికి ముందు, Vodafoneలో ఉత్తర ప్రదేశ్ మార్కెట్ బిజినెస్ హెడ్‌గా శ్రీ సంతానం పనిచేశారు. 2013లో, ముంబైలో డేటా, పరికరాలు మరియు కంటెంట్ మరియు ఇన్నోవేషన్ సంబంధిత కొత్త బిజినెస్ వర్టికల్‌కి నాయకత్వం వహించే బాధ్యత ఆయనకి అప్పగించారు. Reliance Communications, ICICI Bank మరియు PowerGenలలో ఆయన నాయకత్వ బాధ్యతల్లో పనిచేశారు, వ్యూహం, M&A మరియు బిజినెస్ వంటి రంగాలలోనూ ఆయన ఉనికి కలిగి ఉన్నారు. Forbes ప్రకటించిన 'The World's Most Influential CMOs 2020'' జాబితాలో భారతదేశం నుండి టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక CMOగా ఆయన నిలిచారు.
శ్రీ సంతానం అన్నా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారు మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు పూర్వ విద్యార్థిగా కూడా ఉన్నారు.