గ్రూప్ హెడ్ - లెండింగ్ ఆపరేషన్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

శ్రీ ఎన్ శ్రీనివాసన్

శ్రీ ఎన్ శ్రీనివాసన్ ప్రస్తుతం హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్‌లో గ్రూప్ హెడ్ – లెండింగ్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతల్లో భాగంగా హోల్‌సేల్, రిటైల్, వ్యవసాయం మరియు హోమ్ లోన్ విభాగాలతో సహా వ్యాపారాల కోసం లోన్లు ఇవ్వడానికి ఆయన బాధ్యత వహిస్తున్నారు. అనేక ట్రాన్స్‌ఫార్మేటివ్ ప్రాజెక్టులకు నాయకత్వం వహించిన శ్రీ శ్రీనివాసన్ తన నైపుణ్యాన్ని డిజిటైజేషన్ మరియు ఆపరేషన్స్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లోకి కూడా విస్తరించారు. డిజిటల్ లెండింగ్‌లో బ్యాంక్ సంబంధిత పెద్ద-స్థాయి కార్యక్రమాలు మరియు పరిశ్రమలోనే మొట్టమొదటి ఆవిష్కరణల్లో భాగంగా, భారీ పోర్ట్‌ఫోలియోల విలీనం సమయంలో బ్యాంక్ సంబంధిత విస్తృతమైన కార్పొరేట్ మరియు రిటైల్-లోన్ పోర్ట్‌ఫోలియోలకు మద్దతు అందించే ఆపరేషనల్ సిస్టమ్‌ల అభివృద్ధి మరియు ఆపరేషన్స్ ట్రాన్సిషన్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు.

రిటైల్ ఆస్తుల కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి మరియు బ్యాంక్ అడ్వాన్స్ పోర్ట్‌ఫోలియో కోసం గ్రౌండ్-అప్ కార్యకలాపాలను స్థాపించడానికి ముందు శ్రీ శ్రీనివాసన్ 1996 లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా బ్యాంక్‌లో చేరారు.

కస్టమర్ల కోసం బ్యాంకింగ్ సేవలు - ఇ-సైనింగ్, ఇస్టాంపింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, వాహనాల మీద తనఖా తొలగింపు కోసం ఎలక్ట్రానిక్ NOCలు మరియు క్రెడిట్ లింక్డ్-స్కీంల కోసం ఇంటర్ బ్యాంక్ పోర్టల్‌ డిజిటలైజేషన్‌కు సంబంధించిన వివిధ కమిటీలలో ఆయన సభ్యునిగా ఉన్నారు.

భిలాయ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో శ్రీ శ్రీనివాసన్ తన కెరీర్‌ ప్రారంభించారు. చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు మరియు కంపెనీ సెక్రటరీ ఫైనల్ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలవడం ద్వారా గోల్డ్-మెడల్‌ అందుకున్నారు.