గ్రూప్ హెడ్ - రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

శ్రీ సంపత్ కుమార్

శ్రీ సంపత్ కుమార్ - బ్యాంక్ వద్ద పశ్చిమ మరియు దక్షిణ ప్రాంతాన్ని కవర్ చేసే రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్.

తన గత బాధ్యతలో భాగంగా, విదేశీ మరియు విదేశాల్లోని బ్రాంచ్‌ల కోసం ప్రోడక్టులు మరియు పరిష్కారాలు అందించడం, ప్రైవేట్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రోడక్ట్ మరియు రీసెర్చ్, ATM, డీమ్యాట్, వర్చువల్ రిలేషన్‌షిప్ మేనేజర్ మరియు బిజినెస్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రోడక్టులు బలోపేతం చేయడం లాంటి రిటైల్ లయబిలిటీ పోర్ట్‌ఫోలియో అభివృద్ధి చేయడంలో శ్రీ కుమార్ బాధ్యత వహించారు.

ఆగస్ట్ 2000 లో బ్యాంక్‌లో చేరడానికి ముందు, శ్రీ కుమార్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో పనిచేశారు.

29 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఒక ప్రొఫెషనల్‌గా, 2008లో భారతీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద డీల్‌తో సహా తన క్రెడిట్‌లో అనేక కెరీర్ మైలురాళ్లను శ్రీ కుమార్ కలిగి ఉన్నారు; 2014లో FCNR (B) సేకరణలో బ్యాంక్‌ని కీలక స్థానానికి తీసుకెళ్లడం మరియు బ్యాంక్ కోసం విజయవంతమైన వృద్ధి పథం రూపొందించడం లాంటివి ఆయన ఖాతాలో ఉన్నాయి.

తమిళనాడులోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో శ్రీ కుమార్ పూర్వ విద్యార్థి. వ్యక్తిగత సమయంలో, గోల్ఫ్ ఆడడాన్ని ఆయన చాలా ఆస్వాదిస్తారు. విభిన్న ప్రతిభావంతులు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం అందించే ప్లాట్‌ఫారమ్‌లు సృష్టించడంలోనూ ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు.