గ్రూప్ హెడ్ - రిటైల్ అసెట్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

శ్రీ అరవింద్ వోహ్రా

శ్రీ అరవింద్ వోహ్రా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్. అదనంగా, అతను హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్ బోర్డులో కూడా సేవలు అందిస్తున్నారు.

రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్, ట్రేడ్ మరియు ఫోరెక్స్ బిజినెస్ గ్రూప్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా, 2018లో శ్రీ వోహ్రా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో చేరారు, రిటైల్ లయబిలిటీల ఫ్రాంచైజ్, రిటైల్ మరియు బిజినెస్ అసెట్స్ ఒరిజినేషన్, కస్టమర్ సముపార్జన, సమగ్ర కస్టమర్ జీవిత చక్ర నిర్వహణ, విశ్లేషణల ఆధారిత అంతర్దృష్టి గల కస్టమర్ సంభాషణలు మరియు వినియోగదారుల ప్రయాణాల సరళీకరణ మరియు డిజిటలైజేషన్ ద్వారా కస్టమర్ అనుభవ శ్రేష్ఠత సంబంధిత ముఖ్య ప్రాధాన్యతల మీద ఆయన దృష్టి సారించారు.

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌లో చేరడానికి ముందు, రెండున్నర దశాబ్దాలకు పైగా శ్రీ వోహ్రా తన కెరీర్‌లో భాగంగా బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్ మరియు వినియోగదారు రంగాల్లో వినియోగదారుల కేంద్రీకృత వర్గాలతో పనిచేశారు మరియు Vodafone, Philips, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకులలో బిజినెస్ లీడర్‌షిప్ స్థానాల్లో పెద్ద టీమ్‌లకు నాయకత్వం వహించారు మరియు బిజినెస్‌లను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు.

ఇంజనీర్‌గా విద్యాభ్యాసం చేసిన శ్రీ వోహ్రా 1995 లో భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి MBA పూర్తి చేశారు మరియు 2015లో లండన్ బిజినెస్ స్కూల్ నుండి సీనియర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేశారు.