చెక్ చేయబడిన బ్యాగేజ్ ఇన్సూరెన్స్

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి భారతదేశం వెలుపల (అంతర్జాతీయంగా) ప్రయాణం చేస్తున్నప్పుడు అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ మరియు ప్రయాణం చేసే వాహనం ప్రమాదానికి గురి అయితే కార్డు హోల్డర్ యొక్క వ్యక్తిగత బ్యాగేజ్ కోల్పోయినప్పుడు, వాటి అసలు విలువ వరకు వర్తిస్తుంది.

చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం ఇన్సూరెన్స్ కింద ఏవైనా క్లెయిమ్‌లను అంగీకరించడానికి, ప్రాసెస్ చేయడానికి సంఘటన జరిగిన తేదీకి 3 నెలల ముందు కార్డ్‌హోల్డర్ డెబిట్ కార్డ్ ఉపయోగించి కనీసం ఒక కొనుగోలు ట్రాన్సాక్షన్ నిర్వహించి ఉండాలి.

అగ్నిప్రమాదం మరియు దోపిడీ / చెక్ చేయబడిన బ్యాగేజ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి, ఏదైనా సమీప హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ బ్రాంచ్ వద్ద సంఘటన జరిగిన తేదీ నుండి 30 రోజుల్లోపు కార్డ్ హోల్డర్ క్రింద పేర్కొన్న డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. అనుసరించాల్సిన ప్రక్రియ గురించి బ్రాంచ్ కస్టమర్‌కు తదుపరి మార్గనిర్దేశం చేస్తుంది.

  • FIR
  • ఆర్టికల్ నష్టం యొక్క విలువను తెలిపే డాక్యుమెంటరీ సాక్ష్యం

హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్వీకరణ అనేది బాధ్యత యొక్క అంగీకారం కాదు అని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అందుకున్న క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది మరియు పరిశోధించబడుతుంది, వారి నిర్ణయం అంతిమం మరియు దానికి కట్టుబడి ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్న నిర్ణయానికి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ బాధ్యత వహించదు ​​​​​

*కార్డ్ హోల్డర్ అగ్రిమెంట్ ప్రకారం నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.