చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్

శ్రీ రాకేష్ కుమార్ రాజ్‌పుత్

అక్టోబర్ 2023 నుండి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్‌లో చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (CCO)గా శ్రీ రాకేష్ కుమార్ రాజ్‌పుత్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలలో భాగంగా, కాంప్లయెన్స్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించడం మరియు నిర్వహించడం, కాంప్లయెన్స్ పాలసీకి కట్టుబడి ఉండడానికి సంబంధించి తగిన మరియు వివరణాత్మక పర్యవేక్షణతో పాటు కాంప్లయెన్స్ ప్రక్రియ ప్రభావం మరియు సమగ్రత నిర్ధారించడం, బ్యాంక్‌లో దాని కనీస ప్రమాణాలు మరియు వర్తించే చట్టపరమైన మరియు నియంత్రణా ప్రమాణాల బాధ్యతను ఆయన వహిస్తున్నారు.

చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌గా, కంప్లయెన్స్ ఫ్రేమ్‌వర్క్ అనేది కంప్లయెన్స్ రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలు మరియు సాధనాలు కలిగి ఉందని నిర్ధారించే బాధ్యతను శ్రీ రాజ్‌పుత్ వహిస్తున్నారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ బిజినెస్‌లు, నిర్వహణ మరియు కంప్లయెన్స్ ఫంక్షనరీల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. సంబంధిత బిజినెస్ / ప్రోడక్ట్ / కార్యకలాపాలు నుండి ఉత్పన్నమయ్యే కంప్లయెన్స్ రిస్క్‌లు నిర్వహించడానికి మరియు ఆడిట్ కమిటీ / బోర్డు మరియు బ్యాంక్ MD & CEOలకు కంప్లయెన్స్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ మీద తగిన హామీ ఇవ్వడం ఇందులో భాగంగా ఉంటుంది.

శ్రీ రాజ్‌పుత్ మే 2022 లో ఈ బ్యాంక్‌లో చేరారు మరియు బ్యాంక్ చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు డిప్యూటీ చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌గా కంప్లయెన్స్ ఫంక్షన్‌లో ఆయన పనిచేశారు. ఆయనకి 29 సంవత్సరాల అనుభవం ఉంది. భారతదేశంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 26 సంవత్సరాలు పనిచేయడం ఇందులో భాగమే. RBIలో పని చేసిన సమయంలో, బ్యాంకింగ్ సూపర్‌విజన్, ఆర్థిక ఇన్‌క్లూజన్ మరియు డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు అడ్మినిస్ట్రేషన్ & పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన పనిచేశారు. RBIలో తన చివరి అసైన్‌మెంట్‌లో భాగంగా, ముంబైలో బ్యాంకింగ్ సూపర్‌విజన్ విభాగం జనరల్ మేనేజర్‌గా ఆయన పదవి నిర్వహించారు.

శ్రీ రాజ్‌పుత్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ సర్టిఫైడ్ అసోసియేట్ అయిన B.Sc. (ఆనర్స్) మరియు బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో అడ్వాన్స్ డిప్లొమా కలిగి ఉన్నారు.