ఇండిపెండెంట్ డైరెక్టర్

డాక్టర్ (శ్రీమతి) సునీతా మహేశ్వరి

డాక్టర్ (శ్రీమతి) సునీతా మహేశ్వరి బ్యాంక్ బోర్డులో ఒక స్వతంత్ర డైరెక్టర్. 

డాక్టర్ (శ్రీమతి) సునీతా మహేశ్వరి ఒక US బోర్డ్ సర్టిఫైడ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఆమె ఉస్మానియా మెడికల్ కాలేజ్‌‌‌‌‌లో తన MBBS ని పూర్తి చేసారు, తరువాత AIIMS, ఢిల్లీ మరియు US లోని యేల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముప్పై (30) సంవత్సరాల అనుభవం గల, ఆమె US మరియు ఇండియాలో నివసించి పనిచేశారు. ఒక చికిత్స నిపుణురాలిగా ఉండటంతో పాటు, డాక్టర్ (శ్రీమతి) మహేశ్వరి Telerad గ్రూపులో ఒక వైద్య పారిశ్రామికవేత్త మరియు సహ-వ్యవస్థాపకురాలుగా ఉన్నారు, ఈ గ్రూపులో ఇవి ఉంటాయి:

(a) Teleradiology Solutions Private Limited (భారతదేశంలో మొదటి మరియు అతిపెద్ద టెలీరేడియాలజీ కంపెనీ, ఇది ప్రపంచవ్యాప్తంగా రోగులు మరియు ఆసుపత్రులకు 8 మిలియన్లకు పైగా డయాగ్నోస్టిక్ రిపోర్టులను అందించింది), 
(b) AI ఆధారిత టెలీ హెల్త్ సాఫ్ట్‌వేర్‌ను నిర్మించే Telrad Tech Private Limited మరియు 
​​​​​​​(c) RXDX Healthcare - బెంగుళూరు మరియు గ్రామీణ భారతదేశంలో మల్టీ-స్పెషాలిటీ నైబర్‌హుడ్ ఫిజిటల్ క్లినిక్‌ల చైన్.

ఆమె టెలీ హెల్త్ రంగంలో Healtheminds - అనే ఒక టెలీ-కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ వంటి ఇతర స్టార్ట్-అప్ కంపెనీలను కూడా ఏర్పాటు చేశారు. ఆమె భారతదేశంలో సోషల్ కార్యక్రమాలలో చురుకుగా ఉన్నారు, ఇక్కడ ఆమె 2 ట్రస్ట్ నిధులను నిర్వహిస్తున్నారు. 'People4people' ప్రభుత్వ పాఠశాలలలో 650 కంటే ఎక్కువ ఆట స్థలాలను ఏర్పాటు చేసింది మరియు Telrad Foundation ఆసియాలోని పేద ప్రాంతాలలో అధిక నాణ్యతగల వైద్య సంరక్షణ పొందలేని ప్రజలకు టెలీరేడియాలజీ మరియు టెలీమెడిసిన్ సేవలను అందిస్తుంది. ఆమె ఇతర ఆసక్తులలో టీచింగ్ ఒకటి - ఆమె ఒక దశాబ్దానికి పైగా పీడియాట్రిక్ కార్డియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ల కోసం భారతదేశంలో ఇ-టీచింగ్ ప్రోగ్రామ్‌ను నడుపుతున్నారు. ఆమె Yale Institute for Global Health లో సుస్థిరమైన ఆరోగ్య కార్యక్రమం కోసం రెసిడెంట్ మెంటర్‌‌‌‌‌‌గా ఉన్నారు, ఇక్కడ ఆమె మరియు ఆమె భర్త ప్రపంచవ్యాప్త ఆరోగ్య ఆవిష్కరణ కోసం కళ్యాణ్‌పూర్-మహేశ్వరి ఎండోమెంట్‌ను స్థాపించారు. ఆమె ప్రస్తుతం Pediatric Cardiac Society of Indiaకు ప్రెసిడెంట్.

ఆమె తన పేరు మీద 200 కంటే ఎక్కువ విద్యా ప్రెజెంటేషన్లు మరియు ప్రచురణలను కలిగి ఉన్నారు మరియు అనేక TEDx చర్చలతో సహా 200 కంటే ఎక్కువ ఉపన్యాసాలను ఇచ్చిన ఒక స్ఫూర్తిదాయక వక్త. డాక్టర్ (శ్రీమతి) మహేశ్వరి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు వాటిలో: ET ఇండియన్ కార్డియాక్ కేర్ ఇన్నోవేషన్ సదస్సు 2024 వద్ద Trailblazing Indian Cardiac Leader, Business world’s 20 most influential women in healthcare 2022; WOW (Woman of Worth) 2019 అవార్డ్; Amazing Indian అవార్డ్- Times Now 2014; Top 20 women Health care achievers in India, Modern Medicare 2009; Yale University- Outstanding Fellow Teacher of the Year అవార్డ్, 1995, మొదలైనవి ఉన్నాయి.

డాక్టర్ (శ్రీమతి) మహేశ్వరి A-KAL Televerse Private Limited, GlaxoSmithKline Pharmaceuticals Limited, Telerad Tech Private Limited, Image Core Lab Private Limited, Healtheminds Solutions Private Limited మరియు Telerad Rx Dx Healthcare Private Limited బోర్డులో డైరెక్టర్.