అరవై (60) సంవత్సరాల వయస్సు గల శ్రీ కైజాద్ భరుచా, బ్యాంక్ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డిఎండి). శ్రీ భరుచా సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ (యూనివర్సిటీ ఆఫ్ ముంబై) నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని (B.Com) కలిగి ఉన్నారు.
బ్యాంకింగ్ కెరీర్‌లో 39 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన, 1995 లో బ్యాంక్ ప్రారంభమైన నాటి నుండి బ్యాంక్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాంక్ వృద్ధి కొరకు ఆయన అందించిన అనేక సహకారాలలో, బ్యాంక్ కార్యకలాపాలలో ప్రధానమైన పాత్ర వహించే క్రెడిట్ మరియు రిస్క్ ఫ్రేమ్‌వర్క్‌లను నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లు బ్యాంక్ యొక్క స్థిరమైన వృద్ధికి మద్దతు ఇచ్చాయి, అదే విధంగా అస్థిరమైన ఆర్థిక పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కునే సామర్థ్యాన్ని బ్యాంక్‌కు అందించాయి.
DMD గా, ఆయన బ్యాంక్‌లో విస్తృతమైన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. శ్రీ భరూచా హోల్‌సేల్ బ్యాంకింగ్, PSU లు, MNC, క్యాపిటల్ మరియు కమోడిటీ మార్కెట్లు మరియు రియాల్టీ బిజినెస్ ఫైనాన్స్‌కు అధిపతిగా ఉన్నారు, శ్రీ భరూచా ఇన్‌క్లూసివ్ బ్యాంకింగ్ ఇనీషియేటివ్ గ్రూప్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) మరియు ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) కార్యకలాపాలను కూడా నిర్వహిస్తారు.
DMD గా తన ప్రస్తుత హోదాలో, ఆయన సమన్వయ కమిటీకి సహ-అధ్యక్షత వహించారు మరియు సమర్ధవంతంగా నడిపించారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్‌తో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ యొక్క విలీనం సజావుగా సాగేలా పూర్తి సమన్వయ బాధ్యతను నిర్ధారించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది.
శ్రీ భరూచా 2014 లో బ్యాంక్ బోర్డులో చేరారు మరియు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యునిగా దీర్ఘకాలం సేవలు అందించారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తన పదవీకాలంలో, ఆయన కార్పొరేట్ బ్యాంకింగ్, క్యాపిటల్ మరియు కమోడిటీల మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న కార్పొరేట్ సంస్థలు, బిజినెస్ బ్యాంకింగ్, హెల్త్‌కేర్ ఫైనాన్స్, అగ్రి-లెండింగ్, ట్రాక్టర్ ఫైనాన్సింగ్, కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మరియు సమగ్ర బ్యాంకింగ్ కార్యక్రమాలతో సహా విభిన్న విభాగాలలో విధులు నిర్వహించారు.
ఆయన నాయకత్వంలో, బ్యాంక్ యొక్క CSR కార్యక్రమం, దేశంలోనే అగ్రస్థానం పొందిన కార్యక్రమాల్లో మూడవ స్థానంలో నిలిచింది. శ్రీ భరూచా బ్యాంక్‌లోని వైవిధ్యం మరియు చేర్పు కార్యక్రమాలకు ప్రధాన ప్రోత్సాహకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
శ్రీ భరుచా ఆర్థిక ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయు) మరియు ఇంటర్నల్ అంబుడ్స్‌మ్యాన్ కమిటీ కోసం నియమించబడిన డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమిటీలు, సబ్ కమిటీలు అలాగే ప్రభుత్వం నియమించిన ఇంటర్-మినిస్టీరియల్ కమిటీలో భాగంగా ఉన్నారు. పాలసీపై అభిప్రాయాలను అందించడానికి అతను క్రమం తప్పకుండా రెగ్యులేటర్లు మరియు ప్రభుత్వ సంస్థలతో నిమగ్నమై ఉంటారు.
శ్రీ భరూచా హెచ్ డి ఎఫ్ సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, హెచ్ డి ఎఫ్ సి క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ మరియు హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్ ఐఎఫ్‌ఎస్‌సి లిమిటెడ్ (ఛైర్మన్) బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కాకుండా, శ్రీ భరూచా ఏ ఇతర కంపెనీ లేదా బాడీ కార్పొరేట్‌లో పూర్తి కాలపు హోదా కలిగి లేరు.